తెలంగాణ

telangana

ETV Bharat / city

ఐటీ ఉద్యోగి గర్వపడేలా హైదరాబాద్ అభివృద్ధి: కేటీఆర్​ - ఐటీ ఎగుమతులపై కేటీఆర్​ ట్వీట్

ఆరేళ్లలో ఐటీ ఉద్యోగాలు, ఐటీ ఆధారిత ఎగుమతులు రెట్టింపు అయ్యాయని కేటీఆర్​ ట్విట్టర్​లో పేర్కొన్నారు. హైదరాబాద్​లో ఐటీ వృద్ధి శరవేగంగా జరుగుతోందని హర్షం వ్యక్తం చేశారు.

minister ktr tweet about it exports
ఐటీ ఉద్యోగి గర్వపడేలా హైదరాబాద్ అభివృద్ధి: కేటీఆర్​

By

Published : Nov 24, 2020, 3:24 PM IST

Updated : Nov 24, 2020, 3:31 PM IST

ఐటీ ఉద్యోగి గర్వపడేలా హైదరాబాద్​లో ఐటీ వృద్ధి శరవేగంగా జరుగుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆరేళ్లలో ఐటీ ఉద్యోగాలు, ఐటీ ఆధారిత ఎగుమతులు రెట్టింపయ్యాయని ట్విట్టర్​లో పేర్కొన్నారు. 2014లో రూ. 57 వేల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు, లక్ష 29 వేల కోట్లకు చేరుకున్నట్టు సగర్వంగా ప్రకటించారు.

ఉద్యోగుల సంఖ్య సైతం రెట్టింపవటం వల్ల ప్రఖ్యాత సంస్థలు హైదరాబాద్​లో కొలువుదీరేలా హైదరాబాద్ ఎదిగిందని కేటీఆర్ గుర్తు చేశారు. భవిష్యత్తులో ఐటీలో మరింత వృద్ధిని ఆకాంక్షించే ఐటీ ఉద్యోగులు... డిసెంబర్ 1న కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధికి మద్దతుగా నిలవాలని అభ్యర్థించారు.

ఇదీ చూడండి:మోదీపైనే ఛార్జిషీట్​ వేయాలి: కేటీఆర్​

Last Updated : Nov 24, 2020, 3:31 PM IST

ABOUT THE AUTHOR

...view details