మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్ - కేటీఆర్‌కు మరోసారి కరోనా పాజిటివ్
17:30 August 30
ఇటీవల తనను కలిసినవారు పరీక్ష చేయించుకోవాలని కేటీఆర్ సూచన
KTR Tweet Today: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మరోసారి కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆయన ట్విటర్‌లో వెల్లడించారు. కొన్ని లక్షణాలు కనబడటంతో పరీక్షలు చేయించుకున్నానని.. కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లోనే ఉన్నట్టు తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని, ముందుస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కేటీఆర్ ట్వీట్‌పై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు పెడుతున్నారు.
ఇవీ చదవండి: