తెలంగాణ

telangana

ETV Bharat / city

KTR speech latest: 'సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్​కు పరిశ్రమలు తీసుకెళ్తే ఓరుస్తలేరు' - telangana assembly monsoon session 2021

పోటీ ప్రపంచంలో బతకాలంటే.. స్కిల్​, ఆప్- ​స్కిల్​, రీ-స్కిల్​ పద్ధతిని అలవర్చుకోవాలని మంత్రి కేటీఆర్​(ktr speech in assembly) తెలిపారు. శాసనమండలిలో ప్రతిపక్ష నాయకులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. కిటెక్స్​​ సంస్థలను సిరిసిల్లకు తీసుకెళ్తే బాగుండేదన్న ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి అభిప్రాయానికి మంత్రి... సరదాగా సమాధానమిచ్చారు.

minister-ktr-speech-in-assembly-on-development-in-telangana
minister-ktr-speech-in-assembly-on-development-in-telangana

By

Published : Oct 1, 2021, 4:22 PM IST

టాటాలే కాదు.. తాతలనాటి కులవృత్తులను.. బిర్లాలే కాదు బోర్లాపడ్డ ఎమ్మెస్​ఎమ్​ఈలను పైకి తీసుకురావటమే తెరాస ప్రభుత్వ లక్ష్యమని మంత్రి(ktr speech in assembly today) కేటీఆర్​.. శాసనమండలిలో వివరించారు. ప్రపంచంలో టాప్​ 5 దిగ్గజ కంపెనీలు వాటి రెండో అతిపెద్ద శాఖను తెలంగాణలో పెట్టాయంటే.. పరిశ్రమల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి తెలుస్తోంది.

పెట్టుబడి రంగంలో తిరుగులేని అభివృద్ధి..

"టీ- హబ్​ దేశంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యూబేటర్​. దేశంలో అందరికంటే ముందు మనమే ప్రారంభించాం. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఐటీ రంగంలో 2019, 20లో రెండు త్రైమాసికాల్లో బెంగళూరును దాటినం. ఎబుల్​ లీడల్​.. స్టేబుల్​ గవర్నమెంట్​ వల్లే.. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని పెద్దలు చెబుతున్నారు. ఏరోస్పేస్​ రంగంలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ఎక్కే హెలికాప్టర్​ క్యాబిన్​ నుంచి విమానాల లీప్​ ఇంజిన్లు ఆదిభట్లలో తయారవుతున్నాయి. అక్కడ స్థలం సరిపోక.. ఇబ్రహీంపట్నంలోకి ఎలిమినేడు ప్రాంతంలో ఏరోస్పేస్​ పార్కు ఏర్పాటుకు ప్రాణాళికలు తయారు చేస్తున్నాం. చిప్​ల తయారీలో ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా పేరుగాంచిన మైక్రాన్​.. అమెరికా తర్వాత తన అతిపెద్ద రెండో శాఖను తెలంగాణలో పెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో సామ్​సంగ్​ టీవీలు, షియోమీ, వన్​ప్లస్​ మొబైల్స్​ తయారవుతున్నాయి. రాష్ట్రంలో స్పెషల్​ ఫుడ్​ ప్రాసెసింగ్​ జోన్స్​ నెలకొల్పుతున్నాం." - కేటీఆర్​, మంత్రి

వర్కర్లను ఓనర్లను చేస్తున్నాం...

రాష్ట్రంలో చేనేత రంగాన్ని పెద్దపీట వేస్తున్నామని కేటీఆర్​ తెలిపారు. గతంలో చేనేత రంగానికి ఉన్న నిధులను రూ.70 కోట్ల నుంచి రూ.1200 కోట్లకు పెంచినట్టు పేర్కొన్నారు. నేతన్నకు చేయూత, చేనేత మిత్ర పేర్లతో ఆదుకుంటున్నామన్నారు. రసాయనాలు, నూలు మీద నేతన్నకు 50 శాతం రాయితీ ఇచ్చే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. వర్కర్లను ఓనర్లను చేసే కార్యక్రమాన్ని సుమారు రూ. 400 కోట్లతో ప్రారంభించినట్టు తెలిపారు. ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి అడిగిన ప్రశ్నలో భాగంగా.. కిటెక్స్​ సంస్థను సిరిసిల్లకు తీసుకెళ్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. దాన్ని ఉటంకిస్తూ.. మంత్రి సరదాగా సమాధానమిచ్చారు.

పనిగట్టుకుని విషప్రచారం చేస్తున్నారు...

"ఏదైనా పరిశ్రమ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్​కు వెళ్తే ఓర్వట్లేదు. ఒకవేళ ఆయా ప్రాంతాలకు పరిశ్రమలను తీసుకెళ్తే... కొందరు నాయకులు పనిగట్టుకుని పక్క నియోజకవర్గాలకు వెళ్లి... వాళ్ల ప్రాంతాలను మాత్రమే అభివృద్ధి చేస్తున్నారని విషప్రచారం చేస్తున్నారు. అన్ని అక్కడికే తీసుకెళ్తున్నారనే వాదనలు వినిపిస్తున్నారు. సిరిసిల్ల గ్రామ పంచాయతీగా ఉన్నప్పటి నుంచే అక్కడ పద్మశాలీలు ఉన్నారు. సహజంగానే అక్కడకి వెళ్లాల్సి ఉంటది. అక్కడ హాండ్​లూమ్స్​, పవర్​లూమ్స్​ ఇండస్ట్రీలు ఉన్నాయి. కార్మికులు ఉన్నారు. కిటెక్స్​ వెళ్లకున్నా.. గోకుల్​దాస్​, టెక్స్​పోర్ట్​ కంపెనీలు వచ్చాయి. పెద్ద అప్పిరల్​ పార్క్​ పెడుతున్నాం." - కేటీఆర్​, మంత్రి

ఇదీ చూడండి:

CM KCR speech in assembly: సకల జనుల సహకారంతో తెలంగాణలో హరితనిధి: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details