పట్టణ ప్రగతిని విజయవంతం చేసిన ప్రతి సభ్యునికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. పట్టణాభివృద్ధి, పట్టణ ప్రగతికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రానికి హైదరాబాద్ ప్రధాన ఆర్థిక వనరుగా నిలిచిందని పేర్కొన్నారు. వరుసగా ఐదేళ్ల నుంచి దేశంలోనే అత్యున్నత జీవన ప్రమాణాలు ఉన్న నగరంగా హైదరాబాద్ ఎంపికవుతోందని గుర్తుచేశారు. హైదరాబాద్ అభివృద్ధి, అవసరమైన అన్ని హంగులను సమకూర్చేందుకు సీఎం సంకల్పించారని కేటీఆర్ వివరించారు. ఈ బడ్జెట్‌లో హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు అదనంగా కేటాయించారని తెలిపారు.
పల్లెలు, గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. నూతన పురపాలక చట్టం ద్వారా ఒక మంచి విధానాన్ని అమల్లోకి తెస్తున్నాం. టీఎస్ ఐపాస్ విధానాన్ని ఆదర్శంగా తీసుకుని టీఎస్‌బీపాస్‌ను అమల్లోకి తెస్తున్నాం. హైదరాబాద్‌ను విశ్వనగరంగా రూపొందించేందుకు మిషన్ హైదరాబాద్‌ను తీసుకువస్తున్నాం.
- మంత్రి కేటీఆర్