తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈ చిన్నారుల డ్యాన్స్​కు కేటీఆర్​ ఫిదా, నిజంగానే కేక పెట్టించారుగా - KTR latest tweet

Minister KTR shared Kids Dance to kala chashma song video on Twitter
Minister KTR shared Kids Dance to kala chashma song video on Twitter

By

Published : Aug 26, 2022, 1:27 PM IST

12:32 August 26

ట్విటర్​లో చిన్నారుల వీడియోను పంచుకున్న మంత్రి కేటీఆర్​

KTR సామాజిక మాధ్యమం ట్విటర్​లో మంత్రి కేటీఆర్​ నిత్యం చురుకుగా ఉంటారు. అన్ని అంశాలపై స్పందిస్తూ ఉంటారు. కేంద్రంతో పాటు విపక్షాలపై తనదైన శైలిలో వ్యంగాస్త్రాలు సందిస్తూంటారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తుంటారు. తన అభిమానులు, కార్యకర్తలు, సాధారణ ప్రజలు ఇలా ఎవరు సాయం కోసం అభ్యర్థించిన వెంటనే స్పందించి.. వాళ్లను చూసుకోవాలని తన కార్యాలయానికి సూచిస్తుంటారు. ఇలా ప్రతీ దానికి స్పందిస్తూ.. యాక్టివ్​గా ఉండే కేటీఆర్​ అప్పుడప్పుడు కొన్ని ఆసక్తికర విషయాలను కూడా నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు. అలా.. ట్విటర్​లో వైరల్​ అవుతున్న ఓ వీడియోను ఆయన పంచుకున్నారు. ఆ వీడియో చూస్తే కచ్చితంగా మీ ముఖాల్లో చిరునవ్వు విరబూస్తుందంటూ చెప్పుకొచ్చారు. ఈ పిల్లలు అద్భుతమైన డ్యాన్సర్లు అంటూ ప్రశంసించారు.

అయితే ఆ వీడియోలో.. కొంత మంది విదేశీ పిల్లలంతా కలిసి డ్యాన్స్​ చేస్తున్నారు. అందులో ఏముంది అనుకుంటున్నారా.. వాళ్లు స్టెప్పులేసింది ఓ బాలీవుడ్​ పాటకు మరి. ఈ మధ్య యూట్యూబ్​ షాట్స్​, ఇన్​స్టా రీల్స్, పెళ్లిల్లు, సంగీత్​లు ఇలా​ ఎక్కడ చూసినా.. క్రికెటర్ల నుంచి సామాన్యుల దాకా ఇదే పాటకు స్టెప్పులేస్తున్నారు. అదేనండీ బాలీవుడ్​ బ్యూటీ కత్రినా కైఫ్​ స్టెప్పులతో ఉర్రూతలూగించిన "కాలా చష్మా" పాట. స్నేహితులంతా ఓ చోట చేరి తమదైన శైలిలో డ్యాన్స్​ చేస్తూ.. ఆ వీడియోలను సామాజిక మాధ్యమాలల్లో పెడుతున్నారు. మొత్తానికి సోషల్​ మీడియాను కాలా చష్మా పాట ఓ ఊపు ఊపేస్తోంది. ఇప్పుడు అదే పాటకు నైజీరియన్​ పిల్లలు వేసిన అదిరిపోయే స్టెప్పునకు ఫిదా అయిన కేటీఆర్​.. ఆ వీడియోను ట్విటర్​ వేదికగా పంచుకున్నారు.

ఇదిలా ఉంటే.. అంతకు ముందు ఓ చిన్నారికి మంత్రి కేటీఆర్​ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. "హాయ్​ కేటీఆర్​ అంకుల్​. ఇవాళ నా పుట్టినరోజు. మీరు నన్ను ఆశీర్వదించరూ..!" అంటూ క్యూట్​గా అడిగిన వీడియోను పంచుకుంటూ.. ఆ చిన్నారికి దీవెనలు అందించారు. ఇలా చిన్నారుల వీడియోలు పంచుకుంటూ.. పిల్లలపై తనకున్న ప్రేమను చాటుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details