'ఎంఐఎంతో పొత్తు లేదు... తెరాసదే మేయర్ పీఠం'
బల్దియా పీఠం తెరాసదేనని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మజ్లిస్‌తో తమకు ఎలాంటి పొత్తు లేదని స్పష్టం చేసిన కేటీఆర్... గ్రేటర్‌లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో పాతబస్తీలో 5 డివిజన్లు గెలిచామన్నారు.