తెలంగాణ

telangana

ETV Bharat / city

మిషన్ భగీరథకు కేంద్రం రూ.19 వేల కోట్లు ఇవ్వాలి: కేటీఆర్ - గజేంద్ర సింగ్ షెకావత్​కు కేటీఆర్​ కృతజ్ఞతలు

తెలంగాణలో వందశాతం ఇళ్లకు నల్లానీరు ఇస్తున్నారంటూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్​ ట్వీట్​పై కేటీఆర్​ స్పందించారు. తమ లక్ష్యసాధనను గుర్తించినందుకు సంతోషంగా ఉందన్నారు.

minister ktr retweet on central minister gajendra shekawath tweet
మిషన్ భగీరథకు కేంద్రం రూ.19 వేల కోట్లు ఇవ్వాలి: కేటీఆర్

By

Published : Jan 21, 2021, 11:02 PM IST

మిషన్ భగీరథకు రూ.19వేల కోట్లు ఇవ్వాలన్న నీతి ఆయోగ్ సిఫారసును కేంద్ర ప్రభుత్వం గౌరవిస్తే బాగుంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. వందశాతం ఇళ్లకు తెలంగాణలో నల్లానీరు ఇస్తున్నారంటూ అభినందిస్తూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ట్వీట్​పై కేటీఆర్ స్పందించారు.

షెకావత్ ట్వీట్​ను ట్యాగ్ చేస్తూ... తెలంగాణ లక్ష్యసాధనను గుర్తించినందుకు సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ మానసపుత్రిక అయిన మిషన్ భగీరథకు నిధులివ్వాలన్న నీతి ఆయోగ్​ చేసిన సిఫార్సును మంత్రి గుర్తు చేశారు. ఆ సిఫార్సును కేంద్రం గౌరవిస్తే బాగుంటుందన్నారు.

ఇదీ చూడండి:బస్సు ఛార్జీలు పెంచాలి.. సీఎంకు ఆర్టీసీ వినతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details