KTR on Secretariat Temple: సచివాలయంలో మందిరం నిర్మిస్తాం, మజీద్ నిర్మిస్తాం, చర్చిని కూడా నిర్మిస్తాం.. నిశ్చింతంగా ఉండండి అని ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సచివాలయంలో మందిర నిర్మాణంపై ఓ నెటిజన్ ట్విట్టర్లో అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు. తాము మతం ముసుగులో రాజకీయాలు చేయమని... కేసీఆర్ నాయకత్వంలో.. అన్ని మతాలను సమానంగా చూస్తున్న రాష్ట్రం అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
సచివాలయ ప్రాంగణంలో గతంలో ఉన్న మసీదులు, ఆలయం, చర్చిలను పాత భవనాల కూల్చివేత సందర్భంగా తొలగించారు. వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు చేపడతామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఒక్కో ప్రార్థనా మందిరానికి 1500 చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది.