తెలంగాణ

telangana

By

Published : Nov 18, 2020, 10:33 AM IST

ETV Bharat / city

'రాష్ట్ర మహిళా కమిషన్​కు త్వరలోనే పునరుత్తేజం'

రాష్ట్ర మహిళా కమిషన్​కు రెండేళ్లుగా ఛైర్​ పర్సన్​ లేకపోవటం పట్ల సామాజిక కార్యకర్త సునితా క్రిష్ణన్​ ట్విట్టర్​ వేదిక వ్యక్తం చేసిన అభ్యంతరానికి మంత్రి కేటీఆర్​ స్పందించారు. సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే రాష్ట్ర మహిళా కమిషన్​కు పూర్తి స్థాయిలో మహిళా ఛైర్​ పర్సన్​ను నియమిస్తామని హామీ ఇచ్చారు.

'రాష్ట్ర మహిళా కమిషన్​కు త్వరలోనే పునరుత్తేజం'
'రాష్ట్ర మహిళా కమిషన్​కు త్వరలోనే పునరుత్తేజం'

బాధిత మహిళల తరఫున అండగా నిలబడే.. రాష్ట్ర మహిళా కమిషన్​ను త్వరలోనే పునరుత్తేజ పరుస్తామని ఐటీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రెండేళ్లుగా రాష్ట్ర మహిళా కమిషన్​కు ఛైర్ పర్సన్ లేకుండా ఖాళీగా ఉండటం సరైన సంప్రదాయం కాదని సోషల్ ఆక్టివిస్ట్​ సునితా క్రిష్ణన్ ట్విట్టర్ వేదికగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్, తెలంగాణ సీఎంవోను ఆమె ట్యాగ్ చేశారు.

'రాష్ట్ర మహిళా కమిషన్​కు త్వరలోనే పునరుత్తేజం'

పార్టీలో అందుకు తగిన మహిళలు ఎవరూ లేరని భావిస్తే.. పార్టీలతో సంబంధంలేని మహిళాశక్తిని ఆ స్థానంతో భర్తీ చేయాలని ఆమె సూచించారు. బాధిత మహిళలకు చట్టబద్ధంగా అండగా నిలబడేందుకు ఇది ప్రాధాన్య అంశంగా చూడాలని ఆమె కోరారు. ఇందుకు మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే రాష్ట్ర మహిళా కమిషన్​కు పూర్తి స్థాయిలో మహిళా ఛైర్​ పర్సన్​ను నియమిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: విషం పెట్టి 60కోతులను చంపేశారు.. గుట్టల నడుమ కుప్పలుగా మృతదేహాలు

ABOUT THE AUTHOR

...view details