సోషల్‌మీడియా ట్రోల్స్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యపై సామాజిక మాధ్యమాల్లో తనపై వస్తున్న వార్తలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. మహానగరంలో భారీ వర్షాల కారణంగా రాకపోకలకు అంతరాయం కలిగితే అందుకు తాను బాధ్యుడిని కానని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ట్రాఫిక్ రద్దీపై సామాజిక మాధ్యమాల్లో విమర్శించడం సమంజసం కాదని హితవు పలికారు. హైదరాబాద్ ఖాజాగూడలో రోటరీ క్లబ్ ఆఫ్ బంజారాహిల్స్ నిర్మించిన స్పర్శ్ హాస్పిస్ నూతన భవనాన్ని ప్రారంభించిన కేటీఆర్.. తన అనుభవాన్ని పంచుకున్నారు. ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు ప్రభుత్వం తరఫున చేయాల్సిన కృషి చేస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు.
త్వరలోనే పూర్తిగా పరిష్కరిస్తాం...
"వర్షం పడితే హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఉంటుంది. దానికి నేనొక్కడినే బాధ్యుడిని కాదు. నేను పురపాలక శాఖ మంత్రిని కూడా. అయినప్పటికీ.. సామాజిక మాధ్యమాల్లో నాపై చాలా ట్రోల్స్ చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు కొంత ఉన్నా.. వాటిని ఇప్పటికే చాలా వరకు పరిష్కరించాం. త్వరలోనే పూర్తిగా పరిష్కరిస్తాం కూడా." - కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి
సోషల్ మీడియాలో ట్రోలింగ్...
గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తూ... రోడ్లు వాగులను తలపిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ దృశ్యాలను సోషల్‌మీడియాల్లో షేర్చేస్తూ.. మంత్రి కేటీఆర్‌ను పలువురు ట్యాగ్ చేస్తున్నారు. "అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడమంటే ఇదేనా..?", "హైదరాబాద్‌కు సముద్రం వచ్చినా ఆశ్చర్యం లేదు..!" అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తూ... ట్రోలింగ్ చేస్తున్నారు. ఇదే విషయమై మంత్రి స్పందించారు.
ట్వీట్టర్లో హైదరాబాద్ వర్షాలపై ట్వీట్టర్లో హైదరాబాద్ వర్షాలపై కేటీఆర్ నోటి వెంట శ్రీశ్రీ కవిత..
స్పర్శ్ హాస్పిస్ నూతన భవనాన్ని కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డి సహా ఫినిక్స్ సంస్థ అధినేత సురేష్, డీజీపీ మహేందర్ రెడ్డి, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. శ్రీశ్రీ కవితను కేటీఆర్ గుర్తు చేశారు. "స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్.."అని ఓ సినిమాకు శ్రీశ్రీ అందించిన సాహిత్యాన్ని చెబుతూ.. నిర్వాహకుల్లో ఉత్సాహం నింపారు. స్పర్శ్ హాస్పిస్‌కు నీటి, విద్యుత్ బిల్లులతోపాటు ఆస్తి పన్ను రద్దు చేయనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ఈ కేంద్రానికి భారీ మొత్తంలో విరాళాలు ఇచ్చిన దాతలను కేటీఆర్ సన్మానించారు.
ఇదీ చూడండి:
KBC: కేబీసీలో దాదా, సెహ్వాగ్‌లకు కేటీఆర్‌పై ప్రశ్న.. అదేంటంటే..?