తెలంగాణ

telangana

ETV Bharat / city

నిర్మలా సీతారామన్​ ప్రకటన బాధించింది: కేటీఆర్​ - ktr tweet

తెలంగాణకు అధిక నిధులు ఇచ్చామన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటన బాధించిందని కేటీఆర్​ పేర్కొన్నారు. కేంద్రానికి తెలంగాణ ఏమిచ్చిందో దేశమంతా తెలుసుకోవాలని ట్వీట్ చేశారు.

ktr
ktr

By

Published : Feb 12, 2020, 9:45 PM IST

Updated : Feb 12, 2020, 11:19 PM IST

తెలంగాణకు అధికంగా నిధులు ఇచ్చామన్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కేంద్ర ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు బాధించాయని ట్వీట్ చేశారు. కేంద్రానికి తెలంగాణ ఏమిచ్చిందో దేశమంతా తెలుసుకోవాలని... రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లిన పన్నులు.... కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధుల పట్టికను ట్విట్టర్​లో పెట్టారు.

ఐదేళ్లలో తెలంగాణ.. కేంద్రానికి రూ.2.72 లక్షల కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. ఐదేళ్లలో కేంద్రం నుంచి తెలంగాణకు రూ.1.12 లక్షల కోట్లు మాత్రమే వ‌చ్చాయని వెల్లడించారు.

ఇదీ చూడండి:ఆరేళ్లలో తెలంగాణకు లక్షన్నర కోట్లు ఇచ్చాం : నిర్మల

Last Updated : Feb 12, 2020, 11:19 PM IST

ABOUT THE AUTHOR

...view details