తెలంగాణ

telangana

ETV Bharat / city

తెలంగాణ తల్లి ప్రార్థన గీతాన్ని విడుదల చేసిన కేటీఆర్ - minister ktr about telangana song

minister ktr released telangana talli song wrote by puligonda subbachari
తెలంగాణ తల్లి ప్రార్థన గీతాన్ని విడుదల చేసిన కేటీఆర్

By

Published : Jun 12, 2020, 2:50 PM IST

Updated : Jun 12, 2020, 3:29 PM IST

14:47 June 12

తెలంగాణ తల్లి ప్రార్థన గీతాన్ని విడుదల చేసిన కేటీఆర్

   తెలంగాణ తల్లి ప్రార్థన గీతాన్ని మంత్రి కేటీఆర్​ విడుదల చేశారు. ప్రముఖ సినీ నటుడు ప్రియదర్శి తండ్రి ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి ఈ గీతాన్ని రచించారు. ప్రగతి భవన్​లో.. ప్రియదర్శి తన తల్లిదండ్రులతో మంత్రిని కలిసి పాటను గురించి వివరించారు. పాటను ఆవిష్కరించిన కేటీఆర్​కు ప్రియదర్శి ధన్యవాదాలు తెలిపారు.

     తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, చరిత్ర, సాహిత్యం, శిల్ప కళను గురించి వర్ణించే ఈ పాట బాగుందని మంత్రి కేటీఆర్​ ప్రశంసించారు. ప్రొఫెసర్ సుబ్బాచారి రచించిన ఈ గీతానికి సంగీతాన్ని వి.రాధ సమకూర్చారు. ప్రముఖ సినీ నేపథ్య గాయకులు కృష్ణ చైతన్య, కల్పన, హరిణి, సాయిచరణ్​ ఆలపించారు.  

ఇవీచూడండి:  చర్చలు సఫలం.. విధుల్లో చేరిన జూడాలు

Last Updated : Jun 12, 2020, 3:29 PM IST

ABOUT THE AUTHOR

...view details