విశాఖ ఉక్కును తుక్కు తుక్కు చేసి అమ్మేస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. నీవెవరు అడిగేందుకు.. నీకేం పని ఏపీతో అంటున్నారని... ఆంధ్రప్రదేశ్ దేశంలో లేదా? మేం మాట్లాడొద్దా? అని ప్రశ్నించారు. దేశంలో మాకు భాగస్వామ్యం లేదా అని నిలదీశారు. ఈరోజు విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్ముతున్నారు... రేపు సింగరేణి, బీహెచ్‌ఈఎల్‌పై కూడా పడుతారని మండిపడ్డారు.
ఏపీకి కష్టం వచ్చిందని మేం నోరు మెదపకుండా ఉంటే ఎలా?: కేటీఆర్ - విశాఖ ఉక్కు వార్తలు
KTR
14:51 March 12
ఏపీకి కష్టం వచ్చిందని మేం నోరు మెదపకుండా ఉంటే ఎలా?: కేటీఆర్
'ఏపీకి కష్టం వచ్చిందని మేం నోరు మెదపకుండా ఉంటే ఎలా? రేపు మాకు కష్టం వచ్చినప్పుడు ఎవరు ఉంటారు. ఎవరికో కష్టం వచ్చింది.. నాకెందుకులే అనుకుంటే సరికాదు. మొదట భారతీయులం తర్వాతే తెలంగాణ బిడ్డలం. దేశంలో ఎక్కడ తప్పు జరిగినా అందరూ ఆలోచించాలి.'
- కేటీఆర్, మంత్రి
ఇదీ చదవండి :విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు: కేటీఆర్
Last Updated : Mar 12, 2021, 3:29 PM IST