తెలంగాణ

telangana

ETV Bharat / city

రాకెట్​ ఇంజిన్​ తయారీలో 'స్కైరూట్ ఎయిరోస్పేస్' ప్రతిభ.. కేటీఆర్​ ప్రశంస - తెలంగాణ తాజా వార్తలు

అప్పర్ స్టేజ్ రాకెట్ ఇంజన్​ను విజయవంతంగా పరీక్ష చేయడంపై స్కైరూట్ ఎయిరో స్పేస్ బృందాన్ని మంత్రి కేటీఆర్​ అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.

ktr with skyroot
రాకెట్​ ఇంజిన్​ తయారీలో 'స్కైరూట్ ఎయిరోస్పేస్' ప్రతిభ.. కేటీఆర్​ ప్రశంస

By

Published : Aug 14, 2020, 7:54 PM IST

రాకెట్​ ఇంజిన్​ పైదశను విజయవంతంగా పరీక్షించిన హైదరాబాద్ ఎయిరోస్పేస్ స్టార్టప్​ను మంత్రి కేటీఆర్ అభినందించారు. ఈ ఘనత సాధించిన స్కైరూట్ ఎయిరో స్పేస్ బృందాన్ని ప్రశంసించారు. సంస్థ సభ్యులతో కేటీఆర్ సమావేశమయ్యారు.

అప్పర్ స్టేజ్ రాకెట్ ఇంజన్​ను విజయవంతంగా పరీక్ష చేయడం ద్వారా దేశంలో ఈ ఘనత సాధించిన తొలి ప్రైవేటు సంస్థగా స్కైరూట్ నిలిచింది. స్థానికంగా రాకెట్ ఇంజిన్ తయారీ సామర్థ్యాన్ని చూపిన స్కైరూట్ ఎయిరోస్పేస్​ను కేటీఆర్ అభినందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.

రాకెట్​ ఇంజిన్​ తయారీలో 'స్కైరూట్ ఎయిరోస్పేస్' ప్రతిభ.. కేటీఆర్​ ప్రశంస

ఇవీచూడండి:ఆగస్టు చివరి నాటికి 'ఏకే-203' రైఫిళ్ల ఒప్పందం!

ABOUT THE AUTHOR

...view details