ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయంగా నిలిచిపోతుందని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఉద్యమనేతగా.. విద్యుత్ విషయంలో రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం కేసీఆర్కు విద్యుత్ సంస్థల యాజమాన్యాలు, సిబ్బంది తోడ్పాటునందించారని తెలిపారు.
తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల పనితీరు అద్భుతం : కేటీఆర్ - telangana power minister jagadish reddy
ఎన్నో ఏళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణలో విద్యుత్ ఉద్యోగుల పనితీరు అద్భుతంగా ఉందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కొనియాడారు. విద్యుత్ ఇంజినీర్ల సంఘం డైరీ, క్యాలెండర్ను మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు.
తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల పనితీరు అద్భుతం
హైదరాబాద్ ప్రగతి భవన్లో మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి విద్యుత్ ఇంజినీర్ల సంఘం డైరీ, క్యాలెండర్ను కేటీఆర్ ఆవిష్కరించారు. బాధలు తెలిసిన వారికే బాధ్యత అప్పగించడం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చని కేసీఆర్ రుజువు చేశారని మంత్రి కేటీఆర్ అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో విద్యుత్ ఉద్యోగుల పనితీరు అద్భుతంగా ఉందని కొనియాడారు. సీఎం ఆలోచనల మేరకు రాష్ట్రంలో వెలుగులు విరజిమ్ముతున్న విద్యుత్ శాఖ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
- ఇదీ చూడండి :వాహనదారులకు పెట్రో మోత- మళ్లీ పెరిగిన ధరలు