తెలంగాణ

telangana

ETV Bharat / city

'కేంద్రానికి వెళ్తున్న పన్నుల్లో సగం మాత్రమే రాష్ట్రానికి వస్తున్నాయి'

కేంద్రానికి తెలంగాణ నుంచి పోయే పన్నుల్లో సగం మాత్రమే రాష్ట్రానికి తిరిగి వస్తున్నాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ వృద్ధి, తలసరి ఆదాయం, సమ్మిళిత వృద్ధి వంటి పలు అంశాల గణాంకాలను మంత్రి ట్విట్టర్​లో పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు రూ.2,75,926 కోట్లు కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో తీసుకుందని... అయితే కేవలం రూ.1,40,329 కోట్లు మాత్రమే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తిరిగి ఇచ్చిందని మంత్రి కేటీఆర్ వివరించారు.

'కేంద్రానికి వెళ్తున్న పన్నుల్లో సగం మాత్రమే రాష్ట్రానికి వస్తున్నాయి'
'కేంద్రానికి వెళ్తున్న పన్నుల్లో సగం మాత్రమే రాష్ట్రానికి వస్తున్నాయి'

By

Published : Nov 1, 2020, 2:11 PM IST

రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తున్న పన్నుల్లో సగం మాత్రమే తెలంగాణకి తిరిగి వస్తున్నాయని... రాష్ట్ర ప్రజలంతా ఈ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర జీఎస్టీడీపీ, తలసరి ఆదాయం సైతం భారీగా పెరిగిందనన్నారు. ముఖ్యంగా కీలకమైన రంగాల్లో పెట్టుబడులతో పాటు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేసిన మూలధన వ్యయం ఫలితంగానే ఇది సాధ్యమైందని కేటీఆర్ పేర్కొన్నారు. అదే సమయంలో రాష్ట్రానికి సంబంధించి అప్పులు, జీఎస్​డీపీ రేషియో 22.8 శాతంగా ఉన్నదన్నారు. దేశంలో రుణాలు, జీఎస్​డీపీ రేషియో తక్కువ కలిగిన ఐదు రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ నిలిచిందని కేటీఆర్ తెలిపారు.

'కేంద్రానికి వెళ్తున్న పన్నుల్లో సగం మాత్రమే రాష్ట్రానికి వస్తున్నాయి'

రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధి సమ్మిళితమైనదని ముఖ్యంగా వ్యవసాయం, పరిశ్రమలు, సర్వీస్ సెక్టార్ వంటి అన్ని రంగాల్లోనూ వృద్ధి కొనసాగిందని కేటీఆర్ తెలిపారు. 2014- 2020 మధ్యలో దేశ తలసరి ఆదాయం 54.9 శాతంగా ఉంటే... తెలంగాణ తలసరి ఆదాయం భారీగా పెరిగి 83.9 శాతంగా నిలిచిందన్నారు. తెలంగాణలో ఉన్న అద్భుతమైన నాయకత్వం... సీఎం కేసీఆర్​ చేపట్టిన అపూర్వమైన పరిపాలన విధానాల వల్లనే రాష్ట్ర జీఎస్​డీపీ భారీగా పెరిగిందని... ఇది దేశ సగటు కంటే అధికంగా ఉన్నదని మంత్రి తెలిపారు.

'కేంద్రానికి వెళ్తున్న పన్నుల్లో సగం మాత్రమే రాష్ట్రానికి వస్తున్నాయి'

అద్భుతమైన నాయకత్వం, ప్రగతిశీల విధానాలు, క్షేత్రస్థాయి ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలోనే రాష్ట్రం అభివృద్ధి మార్గంలో దూసుకెళ్తోందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

'కేంద్రానికి వెళ్తున్న పన్నుల్లో సగం మాత్రమే రాష్ట్రానికి వస్తున్నాయి'

ఇదీ చూడండి: 18 ప్రశ్నలకు జవాబివ్వాలంటూ బండి సంజయ్‌కు హరీశ్ లేఖ

ABOUT THE AUTHOR

...view details