వచ్చే బడ్జెట్‌లో గౌడ కులస్తులకు లూనా వాహనాలు అందించే పథకాన్ని తీసుకువస్తామని ఐటీశాఖ మంత్రి తారక రామారావు వెల్లడించారు. గౌడ సంఘం ఆర్థిక అభివృద్ధి సంస్థ ఏర్పాటుపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. అదే విధంగా నాలుగు రకాల విప్లవాలు తీసుకొచ్చి గ్రామీణ అర్థికాభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి తెలిపారు. హైదరాబాద్ జలవిహర్‌లో రాష్ట్ర గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
విదేశీయులకు నీరా రుచి చూపిస్తా: కేటీఆర్ - minister ktr on gouds
అన్ని కులస్తులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో గౌడ సంఘం ఏర్పాటు చేసిన ఆత్మీయ సభకు వచ్చిన ఆయన గౌడ కులస్తులకు వచ్చే బడ్జెట్‌లో లూనా వాహనాలను అందిస్తామని తెలిపారు.
![విదేశీయులకు నీరా రుచి చూపిస్తా: కేటీఆర్ విదేశీయులకు నీరా రుచి చూపిస్తా: కేటీఆర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5597735-525-5597735-1578161021408.jpg)
విదేశీయులకు నీరా రుచి చూపిస్తా: కేటీఆర్
విదేశీయులకు నీరా రుచి చూపిస్తా: కేటీఆర్
70 ఏళ్లుగా ఎదురు చూస్తున్న నీరా ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాణం పోసిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో గౌడ కులస్తులది కీలకపాత్రగా మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పలువురు గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.
TAGGED:
minister ktr on gouds