తెలంగాణ

telangana

ETV Bharat / city

దేశంలోనే సేఫెస్ట్ సిటీగా హైదరాబాద్​ను తీర్చిదిద్దాం: కేటీఆర్​ - పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ మీట్​ ది ప్రెస్​ కార్యక్రమం

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్న ఎన్నో అపోహలను తొలగిస్తూ... తెలంగాణను సీఎం కేసీఆర్​ నాయకత్వంలో అభివృద్ధి మార్గాన నడిపిస్తున్నామని మంత్రి కేటీఆర్​ తెలిపారు. మీట్​ ది ప్రెస్​ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి... ఆరున్నరేళ్లుగా రాష్ట్రం సాధించిన అభివృద్ధిని వివరించారు. హైదరాబాద్​ను సురక్షిత నగరంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు.

దేశం మొత్తం తెలంగాణ​ వైపు చూస్తోంది: కేటీఆర్​
దేశం మొత్తం తెలంగాణ​ వైపు చూస్తోంది: కేటీఆర్​

By

Published : Nov 19, 2020, 11:58 AM IST

Updated : Nov 19, 2020, 12:12 PM IST

దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. రాష్ట్రం ఇంత ఘనత సాధించటానికి కారణం సీఎం కేసీఆర్​ మాత్రమేనని మంత్రి ఉద్ఘాటించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎన్నో రకాల దుష్ప్రచారాలు చేసినా... వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నామని తెలిపారు.

హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ప్రతిపక్షాలు చేసిన ప్రచారాన్ని తిప్పికొడుతూ... దేశంలో నంబర్​ వన్​ సేఫెస్ట్​ సిటీగా పేరుతెచ్చుకున్నామని గుర్తుచేశారు. ఎక్కడా గిల్లిగజ్జాలు.. పంచాయితీలకు తావులేకుండా ముందుకెళ్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆరున్నరేళ్లు బాధ్యతాయుతంగా పనిచేశామని కేటీఆర్​ తెలిపారు.

ఇదీ చూడండి: వందేళ్ల సమస్యలకు తెరాసతోనే మోక్షం: మంత్రి తలసాని

Last Updated : Nov 19, 2020, 12:12 PM IST

ABOUT THE AUTHOR

...view details