జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు ఉచిత తాగునీటి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేడు ప్రారంభించనుంది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్... ఈ పథకాన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని రహమత్‌నగర్ డివిజన్ ఎస్సీఆర్ హిల్స్‌లో... లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఇటీవలే ప్రభుత్వం విడుదల చేసింది. జనవరిలో జారీచేసే డిసెంబర్ బిల్లు నుంచే పథకం అమల్లోకి రానుంది. మురికివాడలు, బస్తీలలో నల్లా కనెక్షన్లకు ఇకపై ఎలాంటి బిల్లు ఉండదన్న అధికారులు... ఆ ప్రాంతాల్లో నల్లాలకు మీటర్లు లేకున్నా... డాకెట్ ఆధారంగా బిల్లు వసూలు చేయనున్నట్టు స్పష్టం చేశారుయ
మీటర్ తప్పనిసరి..
గృహవినియోగానికి నెలకు 20 వేలలీటర్ల ఉచిత మంచినీటి కోసం... మీటర్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. మీటర్ రీడింగ్ ప్రకారం నెలలో 20 వేల లీటర్లు దాటితే ప్రస్తుతం చెల్లిస్తున్న టారీఫ్ ప్రకారం బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. అపార్టుమెంట్లలోని ఒక్కో ఫ్లాటుకు 20వేల లీటర్ల చొప్పున అన్నింటికీ మంచినీళ్లు అందిస్తారు. 10 ప్లాట్లు ఉన్న అపార్టుమెంట్‌కు నెలకు 2 లక్షల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేసి అంతకుమించితే పాతటారీఫ్ లెక్కన బిల్లు వసూలు చేయాలని నిర్ణయించారు. జలమండలికి గ్రేటర్‌లో 10.08 లక్షల నల్లా కనెక్షన్లలో 2.37 లక్షల నల్లాలకే మీటర్లు ఉన్నాయి. ఈ పథకంతో లబ్ధిదారులకు 19.92 కోట్లు ఆదా అయ్యే అవకాశం ఉంది. సుమారు 97 శాతం పేద, మధ్య తరగతి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం చెబుతోంది.
మార్చి 31 వరకు గడువు