తెలంగాణ

telangana

ETV Bharat / city

సొంత రాష్ట్రం నడుపుకునే సత్తా ఉందా అని అడిగారు: కేటీఆర్ - ktr about cosmopolitan Hyderabad

తెలంగాణ రాకముందు సొంత రాష్ట్రం నడుపుకునే సత్తా ఉందా అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారని రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ అన్నారు. ఆరేళ్లలోనే 400 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన భాగ్యనగరాన్ని భారతదేశంలోనే అరుదైన నగరంగా తీర్చిదిద్దామని తెలిపారు. హైదరాబాద్ నిజాం క్లబ్​లో జరిగిన 'విశ్వనగరంగా హైదరాబాద్‌' సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు.

minister ktr in conference on cosmopolitan Hyderabad
సొంత రాష్ట్రం నడుపుకునే సత్తా ఉందా

By

Published : Nov 26, 2020, 1:07 PM IST

Updated : Nov 26, 2020, 1:14 PM IST

సామాన్యునికి ఏం చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి ప్రాధాన్య అంశమని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం వాస్తవికవాది అని తెలిపారు. తెరాస అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే విద్యుత్ సమస్యను పరిష్కరించామని చెప్పారు. 7 వేల మెగావాట్ల నుంచి 16వేల మెగావాట్లకు విద్యుత్ సామర్థ్యాన్ని పెంచామని వెల్లడించారు.

నిజాంక్లబ్​లో జరిగిన 'విశ్వనగరంగా హైదరాబాద్‌' సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. దుర్గంచెరువు తీగల వంతెన, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్, మెట్రో రైలుపై చర్చించారు. 400 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన హైదరాబాద్​ను దేశంలోనే అరుదైన, అద్భుత నగరంగా తీర్చిదిద్దామని తెలిపారు. సౌర విద్యుదుత్పత్తిలో దేశంలోనే తెలంగాణ ద్వితీయస్థానంలో ఉందని చెప్పారు. హైదరాబాద్‌ తాగునీటి అవసరాలం కోసం కేశవాపురం రిజర్వాయర్ నిర్మిస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

Last Updated : Nov 26, 2020, 1:14 PM IST

ABOUT THE AUTHOR

...view details