కరోనా సంక్షోభం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో.. అందివచ్చిన పెట్టుబడి అవకాశాలను... అందిపుచ్చుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని పరిశ్రమలు, ఐటీ శాఖ ఉన్నతాధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ప్రగతిభవన్‌లో పరిశ్రమలు, ఐటీ శాఖ ఉన్నతాధికారులతో కేటీఆర్ (Ktr Review) సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కరోనా సంక్షోభం వలన అనేక రంగాల్లో కొన్ని ఇబ్బందులు, సవాళ్లు తలెత్తినా, వివిధ రంగాల్లో భారత్ లాంటి దేశాలకు అనేక నూతన అవకాశాలను కల్పించిందన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో (Ktr Review On Investments) అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ లాంటి రాష్ట్రాలకు ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవడం ఒక సాదావకాశమని మంత్రి అన్నారు.
పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు..
గత ఏడు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానాలు, సంస్కరణలతో తనదైన ఒక గుర్తింపును సాధించిందని, ఈ గుర్తింపు ద్వారానే సంక్షోభ కాలంలోనూ అనేక పెట్టుబడులను (Ktr Review On Investments)తెలంగాణకు తీసుకురాగలిగామని కేటీఆర్ అన్నారు. ప్రస్తుత కరోనా సంక్షోభ అనంతర కాలంలోనూ మరిన్ని నూతన పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేద్దామన్న కేటీఅర్, నూతన పెట్టుబడుల ద్వారా పెద్ద ఎత్తున తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందని అన్నారు.