రంగారెడ్డి జిల్లాలో ఫార్మా సిటీకి ఇంకా భూ సేకరణ చేయాల్సి ఉందని.. ఇప్పటి వరకు సుమారు 9,110 ఎకరాల 38 గుంటల వరకు భూ సేకరణ చేశామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. స్థానిక నేతలు రాజకీయ దురుద్దేశంతో ఫార్మాసిటీ భూ సేకరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారని మండిపడ్డారు. భూసేకరణ చట్టం ప్రకారం భూమి కోల్పోయిన వారికి నష్ట పరిహారం అందిస్తున్నామని తెలిపారు. కోల్పోయిన భూమికి భూమి ఇచ్చే ఆలోచన లేదని, ఉద్యోగ అవకాశం కల్పిస్తామని మండలిలో కేటీఆర్ స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్.టీ సౌకర్యంలో భాగంగా సర్వీస్ మొత్తంలో ఒక్కసారి దేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చని మంత్రి కేటీఆర్ తెలిపారు. వాటికి సంబంధించిన కేటాయింపుల వివరాలను మంత్రి వెల్లడించారు. 2014-15లో రూ.125.51 కోట్లు, 2015-16లో రూ.163.71కోట్లు, 2016-17లో రూ.235.32 కోట్లు, 2017-18లో రూ.235.28 కోట్లు, 2018-19లో రూ.128.92 కోట్లు, 2019-20లో రూ. 230.95 కోట్లు కేటాయించమన్నారు.