తెలంగాణ

telangana

ETV Bharat / city

భాజపాకు ఓటేస్తే జీహెచ్‌ఎంసీని డిస్ ఇన్వెస్ట్​మెంట్‌ చేస్తారు: కేటీఆర్‌ - minister ktr in ghmc election campaign

ఆరేళ్లలో హైదరాబాద్​కు భాజపా ఏం చేసిందో సూటిగా.. సుత్తిలేకుండా చెప్పాలని కేంద్ర మంత్రులను రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎక్కడికెళ్లినా.. ఆరేళ్లలో ఏం చేశామో చెప్పిన తర్వాతే ఓట్లు అడుగుతున్నామని తెలిపారు.

trs working president ktr
తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్

By

Published : Nov 24, 2020, 12:23 PM IST

Updated : Nov 24, 2020, 12:29 PM IST

ఎవరి భవిష్యత్​ కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారని ఎన్డీఏ సర్కార్​ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. భాజపా విధానమే పెట్టుబడుల సంహరణ అని అన్నారు. ఆరేళ్లలో హైదరాబాద్​కు భాజపా ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. భాజపాకు ఓటేస్తే జీహెచ్‌ఎంసీని డిస్ ఇన్వెస్ట్​మెంట్‌ చేస్తారని విమర్శించారు.‌

ఐటీఆర్​ను రద్దు చేసినందుకు యువత.. కరోనా కాలంలో నరకం చూసిన లక్షల మంది వలస కార్మికులు భాజపాపై ఛార్జిషీట్​ వేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీతో ఎవరిని ఉద్ధరించారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ జీరో అకౌంట్‌లో రూ.15 వేలు వేస్తామని చెప్పారని, ఎంతమంది ఖాతాల్లో నగదు వేశారో భాజపా నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు.

భాజపాకు ఓటేస్తే జీహెచ్‌ఎంసీని డిస్ ఇన్వెస్ట్​మెంట్‌ చేస్తారు: కేటీఆర్‌
Last Updated : Nov 24, 2020, 12:29 PM IST

ABOUT THE AUTHOR

...view details