గ్రేటర్ ఎన్నికల్లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు శనివారం నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. ప్రచారం గడువు ముగిసే వరకూ రోజూ రోడ్ షోలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి కేటీఆర్ రోడ్ షోలు ప్రారంభం కానున్నాయి. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు చోట్ల కేటీఆర్ ప్రసంగించనున్నారు.
రేపటి నుంచి గ్రేటర్లో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం - ghmc elections
బల్దియా ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగియడం వల్ల ఇక శనివారం నుంచి ప్రచారపర్వం ఊపందుకోనుంది. కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి కేటీఆర్ రోడ్ షోలు మొదలుపెట్టనున్నారు.
రేపటి నుంచి గ్రేటర్లో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం
సాయంత్రం 5 గంటలకు కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ అల్లాపూర్ చౌరస్తా, మూసాపేట చిత్తారమ్మ తల్లి చౌరస్తాలో కేటీఆర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఐడీపీఎల్ చౌరస్తా వద్ద రాత్రి 7 గంటలకు, సాగర్ హోటల్ జంక్షన్ వద్ద రాత్రి 8 గంటలకు ప్రసంగిస్తారు. రోడ్ షోల కోసం ప్రత్యేక ప్రచార రథాలు సిద్ధమయ్యాయి.
ఇవీ చూడండి: 'తెరాస చేసిన అభివృద్ధిని ఇంటింటికీ ప్రచారం చేయండి'