KTR Tweet Today: రాజన్న సిరిపట్టు బ్రాండ్‌ను మరింత విస్తృతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహకారం అందిస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక, టెక్స్‌టైల్‌శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. న్యూజిలాండ్‌లో సిరిసిల్ల పట్టుచీర రాజన్న సిరిపట్టు బ్రాండ్‌ను ఆ దేశ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ అవిష్కరించారు. అక్కడ జరిగిన ఈ కార్యక్రమంలో జూమ్ మీటింగ్ ద్వారా పాల్గొన్న మంత్రి కేటీఆర్ "సిరిసిల్ల పట్టుచీర'' ప్రాముఖ్యతపై సందేశం ఇచ్చారు. సిరిసిల్ల పట్టుచీర రాజన్న సిరిపట్టు అంతర్జాతీయ వేదికలపై అనేక మందిని ఆకర్షిస్తోందని పేర్కొన్నారు.
రాజన్న సిరిపట్టు చీరలను ప్రారంభించిన న్యూజిలాండ్ మంత్రి ప్రియాంకకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. సిరిసిల్లకు చెందిన నేతన్నల ఉత్పత్తులు ప్రపంచ వేదికలపైన ఆవిష్కారం కావడం అత్యంత సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు. ఆ దేశ మంత్రి ప్రియాంక రాధకృష్ణన్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్ఆర్ఐ, బ్రాండ్ తెలంగాణ ఫౌండర్ సునీత విజయ్ తదితరులను అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల కారణంగా ఒకప్పుడు సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల నేతన్నలు ఇప్పుడు వినూత్నమైన ఉత్పత్తులతో ప్రపంచాన్నిఆకర్షించే పరిస్థితికి చేరుకున్నారన్నారని తెలిపారు.