జేఈఈలో సత్తా చాటిన విద్యార్థులకు కేటీఆర్ అభినందనలు
జేఈఈ మెయిన్స్ పరీక్షలో సత్తా చాటిన విద్యార్థులకు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. బాలికల విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన చుక్కా తనూజను మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.
minister ktr compliments to jee rankers in telnagana
జేఈఈ మెయిన్స్ పరీక్షలో అద్భుత ప్రతిభ కనబరిచిన రాష్ట్ర విద్యార్థులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. వంద పర్సెంటైల్ సాధించిన 24 మందిలో రాష్ట్ర విద్యార్థులు ఎనిమిది మంది ఉండడం తెలంగాణకే గర్వకారణమని మంత్రి కొనియాడారు. విద్యార్థులందరికీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. బాలికల విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన చుక్కా తనూజను మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.