KTR Comments on Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశాన్ని ఎన్నిసార్లు ఫూల్ చేస్తారని రాష్ట్ర ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము సొంత గ్రామానికి విద్యుత్ సదుపాయం కల్పించిన వార్తా కథనాన్ని జోడిస్తూ ట్విట్టర్లో కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.
'మోదీ గారు దేశాన్ని ఎన్నిసార్లు ఫూల్ చేస్తారు..?' - విద్యుత్ సదుపాయం
KTR Comments on Modi: అవకాశం దొరికిన ప్రతీసారి అటు భాజపాపై, ఇటు ప్రధాని మోదీపై విమర్శలు చేసే మంత్రి కేటీఆర్.. మరోసారి ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించినట్టు నాలుగేళ్ల క్రితమే ప్రకటించిన మోదీ.. నాలుగురోజుల క్రితం రాష్ట్రపతి అభ్యర్థి గ్రామానికి కరెంటు సదుపాయం కల్పించారని ఎద్దేవా చేశారు.
minister ktr comments on prime minister modi in twitter
అబద్ధాలు, అబద్ధాలు, భాజపా మార్క్ అబద్ధాలు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సదుపాయం కల్పించినట్లు 2018 ఏప్రిల్లో ప్రధాని మోదీ ప్రకటించినట్లు కేటీఆర్ గుర్తు చేశారు. అయితే ఎన్పీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గ్రామానికి మాత్రం 2022 జూన్ 25న విద్యుత్ సదుపాయం కల్పించారని ఎద్దేవా చేశారు.
ఇవీ చూడండి: