కొన్ని ఓట్లు, సీట్ల కోసం మతిభ్రమించిన మాటలు మాట్లాడుతున్నారని ఎంపీ బండి సంజయ్‌ను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల్లో భాజపా మేయర్ అభ్యర్థి గెలిచిన తర్వాత పాతబస్తీ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు.
'ఓట్లు, సీట్ల కోసం మతిభ్రమించిన మాటలు మాట్లాడుతున్నారు' - జీహెచ్ఎంసీ ఎన్నికలు
హైదరాబాద్‌లో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామన్న భాజపా నాయకుడు బండి సంజయ్ వ్యాఖ్యలను పురపాలకశాఖ మంత్రి ఖండించారు. ప్రశాంతంగా ఉన్న నగరంలో విద్వేషాలు రెచ్చగొట్టకూడదని వ్యాఖ్యానించారు.
'ఓట్లు, సీట్ల కోసం మతిభ్రమించిన మాటలు మాట్లాడుతున్నారు'
ఈమేరకు ట్విట్టర్లో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి కోట్ చేస్తూ.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తన సహచర ఎంపీ బండి సంజయ్ చేసిన ఈ గర్హనీయమైన, విద్వేషపూర్వక వ్యాఖ్యలను ఎలా సమర్థిస్తారని కేటీఆర్ ట్విట్టర్లో ప్రశ్నించారు.
ఇవీ చూడండి: కేసీ రావు, కేటీ రావు.. తెలంగాణకు ఏమీ రావు: తేజస్వీ సూర్య