KTR on Bilkis Bano Case: బిల్కిస్ బానో అత్యాచార దోషుల విషయంలో మంత్రి కేటీఆర్ నిప్పులు చెరుగుతున్నారు. 11 మంది నిందితులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయటాన్ని తీవ్రంగా తప్పుబట్టిన మంత్రి కేటీఆర్.. ఇప్పుడు మరోసారి స్పందించారు. స్వాత్రంత్ర్య దినోత్సవం రోజునే 11 మంది దోషులను విడుదల చేయడాన్ని మంత్రి కేటీఆర్ ఖండించారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ జోక్యం చేసుకుని ఆ రేపిస్టులను విడుదల చేయకుండా.. కఠిన శిక్ష పడేలా చూడాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి కూడా చేశారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురిని నుంచి వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే.
ఇలాంటి ఘటనలు మన దేశంలోనే చెల్లుతాయంటూ కేటీఆర్ నిర్వేదం
KTR on Bilkis Bano Case బిల్కిస్ బానో అత్యాచార దోషుల్ని విడుదల చేయటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్ ఇదే ఘటనపై మరోసారి ట్విటర్ వేదికగా స్పందించారు. ఈసారి నిర్వేదంతో కూడిన ఆక్రోశాన్ని మంత్రి కేటీఆర్ వెల్లగక్కారు. ప్రతి ఒక్కరు దీనిపై గొంతెత్తాలని సూచించారు. అసలేమైందంటే
అయితే.. జైలు నుంచి విడుదలైన దోషులకు.. స్థానికంగా కొంతమంది పూల మాలలు వేసి సత్కరించారు. దోషులను విడుదల చేయడంపైనే తీవ్ర వ్యతిరేకత వస్తుంటే.. పైగా వారికి కొందరు పూల మాలలు వేసి ఆహ్వానించటాన్ని చూసి మంత్రి తీవ్ర అసహనాన్ని తనదైన శైలిలో వెల్లగక్కారు. దీనిపై ట్విటర్ వేదికగా స్ఫందించిన కేటీఆర్... రేపిస్టులకు పూల మాలలు వేసి యుద్ధ వీరుల్లా సత్కరించటం మన దేశంలోనే చెల్లుతుందని నిర్వేదం వ్యక్తం చేశారు. కొందరి తీరుకిది నిదర్శనమనమంటూ రాసుకొచ్చారు. బిల్కిస్‌కి జరిగిన ఘటన మనలో ఎవరికైనా జరగొచ్చని.. నిందితులకు పూల మాలలు వేయటంపై భారత్ గొంతెత్తి ప్రశ్నించాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
ఇవీ చూడండి: