భారతీయ జనతా పార్టీ నేతల నుంచి 12 కోట్ల ఉద్యోగాల వివరాల కోసం వేచిచూస్తున్నామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. నియామకాలపై ఇటీవల రాసిన బహిరంగ లేఖతో కూడిన ట్వీట్‌ను జత చేసిన కేటీఆర్... ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని భాజపా హామీ ఇచ్చిందని పేర్కొన్నారు.
'12 కోట్ల ఉద్యోగాల వివరాల కోసం వేచిచూస్తున్నా' - భాజపా నేతలకు కేటీఆర్ సవాల్
భాజపా నేతలకు మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో సవాల్ విసిరారు. రాష్ట్రంలో నియామకాలపై విపక్షాలు విమర్శిస్తున్న క్రమంలో... మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సవివర జాబితాను విడుదల చేశారు. భాజపా ప్రభుత్వం ఇస్తామన్న ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల వివరాలపై... అదే ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు.
Minister Ktr challenge to Bjp leaders in twitter on Employment Promise
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ నియమాకాల విషయంలో విపక్షాలు తెరాసను విమర్శిస్తుండగా... మంత్రి కేటీఆర్ ఇటీవలే బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాలు ప్రకటించిన కేటీఆర్... ఇప్పుడు భాజపా నేతలను తనదైన శైలిలో సవాల్ చేస్తూ ట్వీట్ చేశారు.