KTR Charity: పంజాబ్‌కు చెందిన దివ్యాంగ క్రీడాకారిణి మాలిక హండకు సాయం చేసేందుకు మంత్రి కేటీఆర్ ముందుకొచ్చారు. మాలిక హండ చెస్‌లో ప్రతిభ పాటవాలు ప్రదర్శిస్తూ పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పతకాలను సాధించారు. అయితే ఎలాంటి సహకారం అందడం లేదన్న ఆమె వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
KTR Charity: కేటీఆర్ దాతృత్వం.. పంజాబ్‌కు చెందిన దివ్యాంగ క్రీడాకారిణికి ఆపన్నహస్తం - chess player malika handa news
KTR Charity: మంత్రి కేటీఆర్ మరోసారి తన దాతృత్వ గుణాన్ని చాటుకున్నారు. పంజాబ్‌కు చెందిన ఓ దివ్యాంగ క్రీడాకారిణి మాలిక హండకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. తాను వ్యక్తిగతంగా సాయపడతానని హామీ ఇచ్చారు.
![KTR Charity: కేటీఆర్ దాతృత్వం.. పంజాబ్‌కు చెందిన దివ్యాంగ క్రీడాకారిణికి ఆపన్నహస్తం KTR Charity](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14087132-634-14087132-1641227720822.jpg)
ktr
ఈ వీడియోపై స్పందించిన కేటీఆర్... వ్యక్తిగతంగా తాను సాయం చేస్తానని ప్రకటించారు. ఆ వెంటనే కేటీఆర్ కార్యాలయ సిబ్బంది మాలిక కుటుంబ సభ్యులను సంప్రదించి ఈ విషయాన్ని తెలియజేశారు. దీనిపై మాలిక కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తమ కుమార్తెకు సాయం అందించేందుకు ముందుకురావడంపై కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీచూడండి:KCR Review on Corona: రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు : సీఎం కేసీఆర్