రక్తదానం చేసిన సైబరాబాద్ సీపీ సజ్జనార్, పోలీసులు, వాలంటీర్లను మంత్రి కేటీఆర్ అభినందించారు. లాక్‌డౌన్ కారణంగా తలసేమియా వ్యాధిగ్రస్థుకు రక్త నిలువలు పెంచేందుకు సైబరాబాద్ పోలీసులు వాలంటీర్ల సహయంతో 117యూనిట్ల రక్తాన్ని సేకరించారు.
సైబరాబాద్ పోలీసులను అభినందించిన మంత్రి కేటీఆర్ - ktr latest news
సైబరాబాద్ పోలీసులు మహత్తరమైన పని చేశారంటూ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. తలసేమియా రోగుల కోసం రక్తదానం చేసిన సైబరాబాద్ సీపీ సజ్జనార్, పోలీసులు, వాలంటీర్లను అభినందించారు. 117యూనిట్ల రక్తాన్ని సేకరించారు.
minister ktr
తలసేమియాతో బాధపడుతున్న రోగులు ముఖ్యంగా చిన్నారులకు రక్తం ఎక్కించేందుకు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సోసైటీ, పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో సీపీ సజ్జనార్ కూడా రక్తదానం చేశారు.
ఇదీ చదవండి:రక్తదానం చేయండి..ప్రాణాలు కాపాడండి: సీపీ సజ్జనార్