తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు రాజకీయ ప్రముఖులు ఓటు వేశారు.
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్‌లోని షేక్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టభద్రులంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. సమస్యలను పరిష్కరించే అభ్యర్థికే తన ఓటు వేశానని కేటీఆర్ స్పష్టం చేశారు. విద్యావంతులంతా సమర్థులకే ఓటు వేయాలని కోరారు.
మహబూబ్‌నగర్‌లో రాష్ట్ర పర్యటక, ఆబ్కారీ శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు పోలింగ్‌లో పాల్గొనాలని కోరారు. విద్యావంతులు ఓటింగ్‌కు దూరంగా ఉంటారనే అపోహను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
ఓటు హక్కు వినియోగించుకున్న హోంమంత్రి మహమూద్ అలీ హైదరాబాద్ మలక్‌పేటలోని పోలింగ్ కేంద్రంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లా కేంద్రంలో బాలుర జూనియర్ కళాశాలలో ని పోలింగ్ కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. దూర ప్రాంతాల్లో ఉండే పట్టభద్రుడు సైతం ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారని మంత్రి తెలిపారు.
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి జగదీశ్ రెడ్డి సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తన సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం జిల్లాలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో ఓటు వేశారు.