తెలంగాణ

telangana

ETV Bharat / city

చట్టవ్యతిరేక చర్యలను ప్రభుత్వం సహించదు: కేటీఆర్ - kishan reddy response on bhynsa violence incident

భైంసాలో హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఘటనను ఖండించారు.

minister ktr and central minister kishan reddy response on bhynsa violence incident
భైంసా ఘటనపై మంత్రుల స్పందన

By

Published : Mar 8, 2021, 1:38 PM IST

భైంసాలో హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్.. హోంమంత్రి, డీజీపీకి విజ్ఞప్తి చేశారు. అల్లర్ల ఘటనలో బాధ్యులకు న్యాయం జరగాలన్న మంత్రి.. చట్టవ్యతిరేక చర్యలను ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. సమాజ పురోగతిలో శాంతి, సామరస్యం కీలకమని కేటీఆర్ స్పష్టం చేశారు.

భైంసా అల్లర్ల ఘటనను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర డీజీపీ, ఎంపీ సోయం బాపురావుతో మాట్లాడి ఘటనపై ఆరా తీశానని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details