ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్లైన్ తరగతుల నిర్వహణ అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సూచించారు. వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని సబితా ఇంద్రారెడ్డి కేటీఆర్కు తెలిపారు.
సర్కారు బడుల్లో ఆన్లైన్ బోధన చేపట్టాలని, జూన్ నుంచి ప్రైవేట్ పాఠశాలలు ఆ దిశగా సిద్ధమవుతున్నాయని కోరుతూ కేటీఆర్కు తెలుగు ఉపాధ్యాయురాలు సునీత ట్వీట్ చేశారు. సునీత ట్వీట్ పై స్పందించిన కేటీఆర్.. ఆ అంశాన్ని పరిశీలించాలని సబితా ఇంద్రారెడ్డిని కోరారు.