KTR about Handloom weavers: మానవ మనుడగడకు రైతన్న తర్వాత ముఖ్య భూమిక నిర్వహించేంది నేతన్నే అని మంత్రి కేటీఆర్ కొనియాడారు. అటువంటి నేతన్నకు అపద వస్తే.. ఆదుకునేందుకు కేసీఆర్ సర్కార్ మానవీయ కోణంలో రైతు బీమా తరహాలో తెస్తున్న మరో అద్బుత సంక్షేమ పథకం నేతన్నకు బీమా అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేతన్నలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా నేతన్నకు బీమా పథకం గురించి చెప్పుకొచ్చారు. ఈ సందర్బంగా నేత కార్మికులు మగ్గంపై వస్త్రాలను నేస్తున్న వీడియోను మంత్రి కేటీఆర్ ట్విటర్లో పంచుకున్నారు.
'మానవ మనుగడలో రైతన్న తర్వాత ముఖ్య భూమిక నేతన్నదే..'
KTR about Handloom weavers: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. నేతన్న కష్టాన్ని కొనియాడిన మంత్రి.. ఆ కుటుంబానికి ఆపద వస్తే ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Minister KTR about nethanna bima scheme for Handloom weavers