తెలంగాణ

telangana

ETV Bharat / city

భూముల ధరలు అన్​లాక్ చేస్తాం.. ఇంచు భూమీ సర్వే చేస్తాం.. - dharani portal in telangana

డబ్బు ఖర్చు పెట్టడం మాత్రమే అభివృద్ధి కాదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సంస్కరణలు అమలు చేసి సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరేలా చేయాలని చెప్పారు. స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే ప్రైవేట్ రంగం ఒడిదొడుకులకు గురికాదని వెల్లడించారు.

minister ktr about dharani portal
ధరణి పోర్టల్​పై కేటీఆర్ వివరణ

By

Published : Nov 27, 2020, 8:01 PM IST

Updated : Nov 27, 2020, 8:10 PM IST

ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లలో పారదర్శకత తీసుకురావడమే ప్రభుత్వ ధ్యేయమని పురపాలక మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. భూముల ధరలు అన్​లాక్ చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఉన్న 1.12 లక్షల చ.కిమీల భూభాగంలో.. కోటి 55 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ధరణి పోర్టల్​లో నమోదైందని తెలిపారు.మిగతా కోటి 22 లక్షల ఎకరాల భూభాగంలో 50 శాతం ధరణిలో నమోదైనట్లు వెల్లడించారు. వ్యవసాయ భూములకు ఆకుపచ్చ పాస్‌ పుస్తకం అందజేస్తామని చెప్పారు.

ధరణి పోర్టల్​పై కేటీఆర్ వివరణ

పట్టణ, గ్రామీణ ఆస్తులను అన్‌లాక్‌ చేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్‌ అన్నారు. ఆస్తులను అన్‌లాక్‌ చేస్తే రూ.వేల కోట్ల ఆర్థిక కార్యకలాపాలకు మార్గం సుగమమవుతుందని తెలిపారు. ప్రజలపై భారం పడకుండా ఆస్తులను క్రమబద్ధీకరిస్తున్నట్లు చెప్పారు.

అసలు యజమానికి హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తద్వారా ప్రభుత్వానికి కూడా ఆస్తి పన్ను సమకూరుతుందని తెలిపారు. ప్రతి ఇంచు భూమిని సర్వే చేసి డిజిటలైజేషన్‌ చేస్తామని.. దీనిద్వారా భూముల వివాదాలు క్రమంగా సమసిపోతాయని చెప్పారు.

Last Updated : Nov 27, 2020, 8:10 PM IST

ABOUT THE AUTHOR

...view details