ఎస్సీ కార్పోరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు పొందేందుకు దరఖాస్తు ఆఖరు తేదీని పొడిగిస్తున్నట్లు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. రుణాలు పొందేందుకు ఆఖరు తేదీ నేటితో ముగుస్తుండగా.. దీనిని ఫిబ్రవరి 10వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. పలు ప్రజా సంఘాలు, నిరుద్యోగ యువత విజ్ఞప్తి మేరకు దరఖాస్తు చేసుకునే గడువు తేదీని పెంచామని కొప్పుల వివరించారు.
1,30,104 దరఖాస్తులు:
ఇప్పటివరకు ఒక లక్షా 30వేల 104దరఖాస్తులు రాగా.. వీటిలో ఎక్కువ భాగం 94వేల 769 మంది హార్టికల్చర్, వ్యవసాయ రంగానికి.. 35వేల 335దరఖాస్తులు రవాణా రంగానికి సంబంధించినవని మంత్రి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇందుకోసం 786కోట్ల రూపాయలు కేటాయించగా.. వీటిలో సబ్సిడీ కింద 500కోట్లు, 279కోట్లు బ్యాంకులు, 7కోట్లు లబ్ధిదారుల వాటా కింద ఉంటుందన్నారు.