Minister Koppula Eshwar: సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సంక్షేమ రంగంలో ముందుకు వెళుతుందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దివ్యాంగుల సలహా మండలి మొట్టమొదటి రాష్ట్ర స్థాయి సమావేశం హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు.
'సంక్షేమం, అభివృద్ధి అంశాలలో రాష్ట్రం దేశం మొత్తానికి ఆదర్శంగా మారింది. దివ్యాంగుల సంక్షేమానికి ప్రతి ఏటా 64 కోట్లు ఖర్చు చేస్తున్నాం. సుమారు 5 లక్షల మంది దివ్యాంగులకు 3వేల16 రూపాయల చొప్పున ప్రతినెల పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ప్రజల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించే గొప్ప మానవతామూర్తి కేసీఆర్. దివ్యాంగులకు విశేష సేవలందిస్తున్న సంస్థలను దత్తత తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇతర రాష్ట్రాలలో అమలవుతున్న అత్యుత్తమ పథకాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి.. సీఎం దృష్టికి తీసుకెళ్లి మరింత మేలు జరిగేలా చూస్తాం.'