పేద ప్రజలు ఉండేందుకు వీల్లేని అమరావతిలో శాసన రాజధాని కూడా ఉండేందుకు వీల్లేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్ను కలిసి చెప్పినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. దీనిపై అన్ని పక్షాలతో మాట్లాడి నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పారంటూ సోమవారం మంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
అమరావతిలో 55 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దానిపై కోర్టుకు వెళ్లి స్టే తీసుకురావడం విడ్డూరమని మంత్రి కొడాలి నాని విమర్శించారు. ఉచిత విద్యుత్తు సంస్కరణల్లో భాగంగా రూ.30 వేల కోట్లతో ఏపీ గ్రీన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతున్నామని, దీన్ని ఏ రైతు వ్యతిరేకించకున్న తెదేపా రాద్ధాంతం చేస్తోందని మంత్రి మండిపడ్డారు.