తెలంగాణ

telangana

ETV Bharat / city

పేకాటకు ఉరిశిక్ష ఉందా? జైలు శిక్ష ఉందా? ఏం శిక్ష వేస్తారు..?

తాము ఆదేశిస్తేనే గుడివాడలో పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు చేశారని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. తెదేపా నేతలు తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పేకాట క్లబ్​లు నిర్వహించిన చరిత్ర తెదేపా నేతలకు ఉందన్నారు. పేకాట శిబిరాలపై దాడులు చేసే దమ్మున్న ప్రభుత్వం తమదన్నారు. దొరికిన వారిలో తన అనుచరులు ఉంటే ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. పేకాడేవారిలో పలానావారే ఉండాలని లేదు కదా అని వ్యాఖ్యానించారు. తనకు సమాచారం ఇస్తే 24 గంటల్లో దాడులు చేయిస్తామన్నారు. పేకాట వ్యవహారంపై సీఎంను కలిశానన్న వార్తలను మంత్రి కొట్టిపారేశారు.

kodali nani
పేకాటకు ఉరిశిక్ష ఉందా? జైలు శిక్ష ఉందా? ఏం శిక్ష వేస్తారు..?

By

Published : Jan 4, 2021, 7:52 PM IST

ఏపీలో ఏం జరిగినా సీఎంకు, ప్రజాప్రతినిధులకు అంటగడుతున్నారని ఆ రాష్ట్ర మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్​తో సమావేశం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడారు. పేకాట శిబిరాలను తాను నిర్వహిస్తున్నట్లు తెదేపా నేతలు ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సహా నేను ఆదేశాలిస్తేనే పోలీసులు శిబిరాలపై దాడులు చేసినట్లు స్పష్టం చేశారు.

గతంలో గుడివాడ నియోజకవర్గంలో క్లబ్బులు మూయించింది తానేనని స్పష్టం చేశారు. ఆదివారం జరిగిన దాడుల్లో పేకాడేవారిలో కొందరు తప్పించుకున్నారని తెలిసిందని తెలిపారు. అందులో ఎంత పెద్ద వారున్నా వదలిపెట్టమన్నారు.

పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు చేయడం, పట్టుకోవడం సాధారణమేనన్న మంత్రి.. అందులో అన్ని పార్టీలవారు ఉండొచ్చని వ్యాఖ్యానించారు. పేకాట శిబిరంలో దొరికిన వారిలో తన అనుచరులు ఉంటే ఉండొచ్చని... పేకాటకు ఉరిశిక్ష ఉందా? జైలు శిక్ష ఉందా? ఏం శిక్ష వేస్తారు? అని వ్యాఖ్యానించారు. వేస్తే అంతో ఇంతో జరిమానా విధిస్తారని చెప్పారు. ఇలాంటి వాటిని ఆరికట్టేందుకే కఠిన చట్టాలను తీసుకొచ్చేందుకు వైకాపా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. పేకాట శిబిరాలపై తనకు సమాచారమిస్తే 24 గంటల్లో దాడులు చేయిస్తాన్నారు.

ఆదివారం గుడివాడ నియోజకవర్గంలో జరిగిన దాడుల్లో నా అనుచరులు ఉండొచ్చు. ఒకవేళ ఉంటే కోర్టులో ప్రవేశపెడతారు. ఏమైనా వారికి ఉరి శిక్ష వేస్తారా..? జరిమానా వేస్తారు అంతే కదా. ఇలాంటి వాటిని ఆరికట్టేందుకే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఎస్​ఈబీ ఏర్పాటు సహా.. ఆన్ లైన్ గేమింగ్స్​ను నిషేధించేలా చట్టం తెచ్చాం. అంతదానికోసం సీఎంను కలవటానికి వస్తానా...? నా వ్యక్తిగత సమస్యల గురించి సీఎంను ఎప్పుడు కలవలేదు. కేవలం ప్రజా సమస్యలపైనే కలుస్తాను. గుడివాడ ప్రజలకు నేనోంటో తెలుసు. ఎవరో ఏదో మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు - కొడాలి నాని, ఏపీ మంత్రి

ఆలయాల్లో విగ్రహాల ధ్వంసంపై కొందరు రాజకీయ లబ్ధిని పొందేందుకు చూస్తున్నారని ఆంధ్రప్రదేశ్​ మంత్రి కొడాల నాని ధ్వజమెత్తారు. చంద్రబాబు అడుగుజాడల్లోనే ఇదంతా నడుస్తోందని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదన్నారు.

పేకాటకు ఉరిశిక్ష ఉందా? జైలు శిక్ష ఉందా? ఏం శిక్ష వేస్తారు..?

ఇవీచూడండి:గుడివాడలో జూద శిబిరాలపై దాడులు.. రూ.42 లక్షలు స్వాధీనం

'గుడివాడలో ఎక్కడా పేకాట క్లబ్బులు లేవు'

ABOUT THE AUTHOR

...view details