మాదకద్రవ్యాల సరఫరాలో అఫ్గానిస్థాన్‌కు తాడేపల్లికి నేరుగా లింకులున్నాయన్న చంద్రబాబు ఆరోపణలపై వైకాపా మండిపడింది. సీఎంకు లింకులున్నాయని చంద్రబాబుకు ఎవరు చెప్పారో స్పష్టం చేయాలని మంత్రి కొడాలి నాని(Minister Kodali Nani Fires On Chandra Babu news) డిమాండ్ చేశారు.
డ్వాక్రా సంఘాలను చంద్రబాబు నిలువునా మోసం చేశారని కొడాలి నాని (minister kodali nani news) ఆరోపించారు. ఎన్నికల నాటికి ఉన్న అప్పును 4 విడతల్లో చెల్లిస్తానని సీఎం జగన్ (cm jagan news )హామీ ఇచ్చి నిలబెట్టుకున్నారని స్పష్టం చేశారు. రెండు విడతల్లో కలిపి రూ. 13 వేల కోట్లు మహిళా సంఘాలకు చెల్లించారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు పొందుతున్న ప్రజలను చంద్రబాబు కుక్కలతో పోల్చుతున్నారని.. ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.