జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిణామాలపై అడిగిన ప్రశ్నలకు లోక్సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లిఖిత పూర్వక సమాధానాలు ఇచ్చారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత 190 రాళ్లు విసిరిన కేసుల్లో 765 మందిని అరెస్టు చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఆగస్టు నెల నుంచి ఎల్వోసీ వద్ద 955 సార్లు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలు జరిగాయని... 370 రద్దు తరువాత పాఠశాలల్లో విద్యార్థుల పరీక్షలకు హాజరు శాతం 99.7 ఉందని పేర్కొన్నారు.
కశ్మీర్లో పరిణామాలపై సమాధానాలిచ్చిన కిషన్రెడ్డి - jammu kashmir
అధికరణ 370 రద్దు తర్వాత కశ్మీర్లో పరిణామాలపై లోక్సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి లిఖిత పూర్వక సమాధానాలు ఇచ్చారు. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేసిన 18 మందిపై ఎన్ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసిందన్నారు.
కశ్మీర్లో పరిణామాలపై సమాధానాలిచ్చిన కిషన్రెడ్డి
ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేసిన 18 మందిపై ఎన్ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసిందని... గడిచిన ఆరు నెలల్లో టూరిజం ద్వారా జమ్మూకశ్మీర్ 25 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించినట్లు కేంద్రం వెల్లడించింది.
ఇవీ చూడండి: కాలుష్యంపై లోక్సభలో చర్చ- ఆప్ సర్కారుపై విమర్శలు