తెలంగాణ

telangana

ETV Bharat / city

'మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని అడగండి.. నడ్డా ఎవరో చెప్తారు' - కేంద్ర హోంశాఖ మంత్రి

గతంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన లక్ష్మారెడ్డిని అడిగితే జేపీ నడ్డా ఎవరో చెప్తారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి తెరాస నేతలకు సూచించారు. రేపు ఈఎస్​ఐ సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రి, మెడికల్​ కళాశాలను కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్​ గంగ్వార్ అధికారికంగా​ ప్రారంభిస్తారని తెలిపారు.

లక్ష్మారెడ్డిని అడగండి.. నడ్డా ఎవరో చెప్తారు: కిషన్​రెడ్డి

By

Published : Aug 20, 2019, 10:45 PM IST

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. గతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన లక్ష్మారెడ్డిని అడిగితే జేపీ నడ్డా ఎవరో తెలుస్తుందన్నారు.

రేపు ఈఎస్​ఐ ఆసుపత్రి ప్రారంభం....​

రాజ్‌భవన్‌ రోడ్‌లోని దిల్‌కుషా అతిథిగృహంలో ఈఎస్‌ఐ, పీఎఫ్‌ అధికారులతో మంత్రి కిషన్​రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపారు. బుధవారం సనత్‌నగర్‌లో ఈఎస్‌ఐ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, మెడికల్ కళాశాలను కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ అధికారికంగా ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అవుట్‌ పేషెంట్​ బ్లాక్​కు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. 32 ఎకరాల్లో 620 పడకలతో మెడికల్ కళాశాల విస్తరించి ఉందని కిషన్​రెడ్డి వివరించారు. కార్మికుల కుటుంబసభ్యుల కోసం కళాశాలలో 50 శాతం సీట్లు కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. సుమారు 200 మంది నిరుపేద విద్యార్థులు ఈ నిర్ణయంతో లబ్ధిపొందుతారని తెలిపారు.

మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని అడగండి.. నడ్డా ఎవరో చెప్తారు: కిషన్​రెడ్డి

ఇవీ చూడండి: 'దమ్ముంటే పాలమూరు ఎత్తిపోతల పూర్తిచేయండి'

ABOUT THE AUTHOR

...view details