తెలంగాణ

telangana

By

Published : Dec 7, 2020, 10:54 PM IST

ETV Bharat / city

'బంద్ ప్రశాంతంగా జరిగేలా చూడాలి'

మంగళవారం రైతులు తలపెట్టిన దేశవ్యాప్త బంద్​పై ఏపీ మంత్రి కన్నబాబు మాట్లాడారు. రైతుల మనోభావాలను గౌరవిస్తున్నామని చెప్పిన ఆయన... మధ్యాహ్నం ఒంటిగంటలోగా ముగిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో బంద్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని రైతు సంఘాలను కోరారు.

minister-kannababu-on-bharat-band
'బంద్ ప్రశాంతంగా జరిగేలా చూడాలి'

మంగళవారం తలపెట్టిన భారత్ బంద్​లో ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావివ్వకూడదని ఏపీ మంత్రి కన్నబాబు అన్నారు. దేశవ్యాప్త బంద్​ను మధ్యాహ్నం ఒంటి గంటలోగా ముగిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

రైతుల మనోభావాలను గౌరవిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత తెరవాలని కోరారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆర్టీసీ బస్సులు నడపవద్దని సూచించారు. రేపు విద్యాసంస్థలు కూడా మూసివేయాలన్న ఆయన.. బంద్‌ ప్రశాంతంగా జరిగేలా రైతుసంఘాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి :భారత్‌బంద్‌లో పాల్గొనేందుకు సన్నద్ధమైన తెరాస

ABOUT THE AUTHOR

...view details