నల్గొండ పర్యటన సందర్భంగా భూ సమస్యలు పరిష్కరించాలన్న సీఎం ఆదేశాలతో అధికారులు చర్యలు చేపట్టారు. సీఎస్ సోమేశ్‌కుమార్, ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి జగదీశ్‌రెడ్డి... తిరుమలగిరి మండలంలోని 5 గ్రామాల్లోని భూ సమస్యలపై చర్చించారు. నెల్లికల్లు, చింతలపాలెం, తునికినూతల, జమ్మన్నకోట, ఎల్లాపురం గ్రామాల్లోని 3వేల 495 ఎకరాల భూమికి సంబంధించి ఎంజాయ్‌మెంట్ సర్వే వెంటనే చేపట్టాలని నల్గొండ కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
వారంరోజుల్లో భూ సమస్యలు పరిష్కరిస్తాం: జగదీశ్ రెడ్డి - nalgonda land disputes news
నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం పలు గ్రామాల్లోని భూ సమస్యలపై మంత్రి జగదీశ్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు సుమారు 3 వేల 495 ఎకరాల భూమికి సంబంధించి ఎంజాయ్‌మెంట్ సర్వే చేపట్టాలని ఆ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
minister jagadish reddy review on nalgonda land disputes
సర్వే చేసి ముసాయిదా జాబితాను ప్రచురించి అభ్యంతరాలుంటే వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్హులకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయాలని... మొత్తం ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలని సూచించారు. ఈ భేటీలో రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రి, ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రాస్, నల్గొండ కలెక్టర్ పాటిల్ ప్రశాంత్ జీవన్ పాల్గొన్నారు.