Jagadeesh reddy Comments: మునుగోడు సభలో కేంద్ర మంత్రి అమిత్ షా అబద్దాలే మాట్లాడారని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన ఒక్క ప్రశ్నకు కూడా అమిత్‌షా వద్ద సమాధానం లేదన్నారు. ఫ్లోరైడ్ నివారణ కోసం జిల్లా ప్రజలు దిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రికి మొరపెట్టుకుంటే ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. పెట్రోల్ ధరలపై అమిత్ షా మాటలు దొంగేదొంగ అన్నట్లుందని ఎద్దేవా చేశారు. మునుగోడు ప్రజలు భాజపాకు డిపాజిట్ రాకుండా చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.
"మునుగోడులోనూ అమిత్ షా అబద్ధాలే మాట్లాడారు. ఆధారం లేకుండా మాట్లాడే బండి సంజయ్ పాత్ర పోషించారు. కేసీఆర్ ఒక్క ప్రశ్నకూ అమిత్ షా వద్ద సమాధానం లేదు. సీఎం కేసీఆర్ ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్ముకూడా లేదు. ప్రపంచంలోనే అద్భుత పథకం రైతుభీమా. ఫ్లోరైడ్ నివారణకు ప్రధానమంత్రి ఏమైనా చేశారా?. పెట్రోల్ ధరలపై అమిత్ షా మాటలు దొంగేదొంగ అన్నట్లుంది. మునుగోడు ప్రజలు భాజపాకే మీటరు పెడతారు. మునుగోడు ప్రజలు భాజపాకు డిపాజిట్ రాకుండా చేస్తారు."- జగదీశ్‌రెడ్డి, మంత్రి