రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న రహదారుల సమస్యలను మంత్రి జగదీశ్‌రెడ్డి, తెరాస ఎంపీల బృందం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. దిల్లీలో కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కేంద్రం మంజూరు చేసిన రహదారులకు గుర్తింపు సంఖ్యలను ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ రీజినల్ రింగ్‌రోడ్డు విషయాన్ని మరోసారి గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు.
కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన రాష్ట్ర బృందం - కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన రాష్ట్ర బృందం
దిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు తెరాస ఎంపీలు కలిశారు. రాష్ట్రంలో పెండింగ్ రహదారులకు సంబంధించిన అంశాలను గడ్కరీ దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు.
కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన రాష్ట్ర బృందం
ఇటీవల కురిసిన వర్షాలకు జాతీయ రహదారులు పాడయ్యాయని వెంటనే మరమ్మతులు చేయించాలని కోరినట్లు తెలిపారు. రహదారులకు సంబంధించి ముఖ్యమంత్రి వినతులను కేంద్రమంత్రికి అందజేశామని... సమావేశం అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి, తెరాస లోక్‌సభా పక్షనేత నామ నాగేశ్వరరావు వెల్లడించారు.
ఇవీ చూడండి: చట్టాల 'దిశ' మార్చండి.. కేంద్రాన్ని కోరనున్న సీఎం