భూమిపై లభించే సహజ వనరులు ఇష్టానుసారంగా వాడటం వల్ల పర్యావరణానికి హాని జరుగుతోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కాలుష్యం వల్ల ఓజోన్ పొర క్షీణిస్తోందని.. దీనివల్ల భయంకరమైన అనారోగ్యాలు సంభవిస్తాయని తెలిపారు.
'నేలతల్లి బాగుంటేనే.. భావితరాలకు మంచి భవిష్యత్' - world earth day
నేలతల్లి బాగుంటేనే.. భావితరాలు బాగుంటాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. భూమాతకు ఎలాంటి హానీ జరగకుండా కాపాడుకోవాలని సూచించారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా.. పుడమితల్లిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు.
ప్రపంచ ధరిత్రి దినోత్సవం, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
భూమాతకు ఎటువంటి హాని కలగకుండా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని.. ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. మానవుని జీవనశైలలిలో మార్పు రావాలని ఆకాంక్షించారు. అడవులు, వన్యప్రాణులు, జీవవైవిధ్య రక్షణకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. నేలతల్లి బాగుంటేనే.. భావితరాలు బాగుంటాయని చెప్పారు.
- ఇదీ చదవండి :తిప్పతీగతో కరోనా ఫట్.. ఆ సీక్రెట్ తెలుసుకోండి..!