తెలంగాణ

telangana

ETV Bharat / city

Tirumala: తిరుమల శ్రీవారి సేవలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి - telangana news

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు.

Tirumala vip darshans, indrakaran reddy in tirumala
శ్రీవారి సేవలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, తిరుమల వీఐపీ దర్శనాలు

By

Published : Sep 13, 2021, 2:59 PM IST

శ్రీవారి సేవలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల(tirumala tirupathi) శ్రీవారిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి(indrakaran reddy) కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. కరోనా(corona) మహమ్మారి పీడ తొలగిపోయి తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీవారిని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ కూడా దర్శించుకున్నారు.

అన్ని రకాలుగా ప్రజలందరినీ కూడా క్షేమంగా ఉంచాలి. ఆరోగ్యంగా ఉండాలి. కరోనా వైరస్‌ను పారదోలాలని చెప్పి మొక్కుకోవడం జరిగింది. రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నాను. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి తెరాస పార్టీ ఘన విజయం సాధిస్తుందని తెలుస్తోంది.

-ఇంద్రకరణ్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి

ఇదీ చదవండి:TTD Incense Sticks: తితిదే బ్రాండ్​తో అగరబత్తీలు.. ఆ పూలతోనే తయారీ.!

ABOUT THE AUTHOR

...view details